
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.
మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులని, గాయపడిన 10 మందిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.