
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ఎపిక్ చిత్రం రామాయణ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి అరణ్యవాసంలో ప్రశాంతంగా కనిపిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.