
రోజూ ఒక గ్లాసు స్వచ్ఛమైన పండ్ల రసం తాగడం వల్ల డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయని న్యూకాసిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నాలుగు వారాల అధ్యయనంలో గుర్తించారు.
పండ్ల రసాలు తాగిన వారి మెంటల్ హెల్త్ స్కోర్లో సాధారణ ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే 2.52 పాయింట్ల సానుకూల వ్యత్యాసం నమోదైందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది.
సిట్రస్ పండ్లలోని ఫ్లావనోయిడ్లు మెదడు కణాలను చురుగ్గా ఉంచుతాయని, తక్కువ ఖర్చుతో మానసిక ప్రశాంతతను పొందేందుకు ఇది మంచి మార్గమని డాక్టర్ ఆలివర్ షానన్ బృందం తెలిపింది.