
సెప్టెంబర్ 19న జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు కల్పిస్తున్న వసతులపై బీసీసీఐ చేసిన ఫిర్యాదును భారత ఒలింపిక్ సంఘం (IOA) తిరస్కరించింది.
టెంట్లలో డ్రెస్సింగ్ రూమ్, 500 మీటర్ల దూరంలో వాష్‌రూమ్‌లు ఉండటంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేయగా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాటితోనే సర్దుకుపోవాలని ఐఓఏ స్పష్టం చేసింది.
ఒకవేళ వసతులు నచ్చకపోతే బీసీసీఐ సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవచ్చని ఐఓఏ సీఈవో రఘురామ్ అయ్యర్ తేల్చి చెప్పారు.