
సీనియర్ నటి షావుకారు జానకి (94) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు తుదిశ్వాస విడిచారు.
తన 75 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 400కు పైగా చిత్రాల్లో నటించారు.
ఆమె భౌతికకాయాన్ని తేనాంపేటలోని స్వగృహంలో ఉంచగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.