
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం నుంచి ఏరో ఎక్స్ప్రెస్ శీతల బస్సు సేవలను ప్రారంభించనున్నట్లు ఆర్ఎం బి.అప్పలనాయుడు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సును నడిపేలా ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.
ఈ కొత్త బస్సు సర్వీసులు భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచనున్నాయి.