
ముంబయి రోడ్ల పరిస్థితి మరియు ట్రాఫిక్ కష్టాలపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ఆయన స్పందిస్తూ తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయిలో నెలకొన్న రవాణా సవాళ్లపై మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.