
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నరసాపురం వద్ద సాయంత్రానికి సుమారు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయగా, కనకాయలంక కాజ్‌వే మునిగిపోవడంతో 850 కుటుంబాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నాయి.
వరద పరిస్థితిని కలెక్టర్ నాగరాణి కోడేరు వద్ద పరిశీలించి, అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.