
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు.
గతంలో రజినీకాంత్ కూలీ సినిమాను కొన్న రేటుకే ఈ సీక్వెల్ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు నాగవంశీ ప్రెస్మీట్లో వెల్లడించారు.
భవిష్యత్తులో డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తన బ్యానర్లోనే తెలుగు సినిమా చేస్తారనే నమ్మకంతోనే ఈ భారీ రిస్క్ తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.