ప్రీడయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
వైట్ రైస్‌కు బదులుగా తృణధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సరైన ఆహారపు అలవాట్లు డయాబెటిస్ రాకుండా కాపాడతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.