
హైదరాబాద్‌లో రూ.70 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ ‘హైపర్ వాల్ట్’ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, 2028 జూన్ 2న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన చర్చల అనంతరం, కేవలం 8 నెలల వ్యవధిలో ఈ డీల్ ఖరారైంది.