
దివంగత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని పవన్ కల్యాణ్ రాధాకు దిశానిర్దేశం చేశారు.