Economy
త్వరలో పాలిమర్ షీట్లతో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తెస్తున్న ఆర్బీఐ

త్వరలో పాలిమర్ షీట్లతో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తెస్తున్న ఆర్బీఐ

Asianet News Telugu19h
THE BRIEF
1

చిరిగిపోని, నీటిలో నానని అత్యంత మన్నికైన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సన్నాహాలు చేస్తోంది.

2

ప్రారంభంలో రెండు డినామినేషన్ల నోట్ల తయారీ కోసం 68,000 రీముల పాలిమర్ షీట్లను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ అంతర్జాతీయ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.

3

ఈ ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయని, టెండర్ దారులకు చైనా లేదా పాకిస్తాన్‌తో సంబంధాలు ఉండకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.