
చిరిగిపోని, నీటిలో నానని అత్యంత మన్నికైన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సన్నాహాలు చేస్తోంది.
ప్రారంభంలో రెండు డినామినేషన్ల నోట్ల తయారీ కోసం 68,000 రీముల పాలిమర్ షీట్లను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ అంతర్జాతీయ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.
ఈ ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయని, టెండర్ దారులకు చైనా లేదా పాకిస్తాన్తో సంబంధాలు ఉండకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.