
గతేడాది కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఆటోమొబైల్ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం ఇచ్చాయని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.
మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ, ఈ సంస్కరణలు లేకుంటే ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో ఆర్థిక పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ 2.0 అమలు వల్ల అన్ని రంగాలు మెరుగైన వృద్ధిని నమోదు చేయగలిగాయని ఆయన విశ్లేషించారు.