ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 14న రాష్ట్ర అగ్నిమాపక శాఖ కోసం కొనుగోలు చేసిన 58 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు.
ఈ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అధునాతన సాంకేతికతతో రూపొందించబడ్డాయని అధికారులు వెల్లడించారు.
ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బందికి ఈ కొత్త వాహనాలు ఎంతో తోడ్పడతాయని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని సీఎం పేర్కొన్నారు.