
పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాలో టిక్‌టాక్ వీడియోల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా 18 ఏళ్ల కాయ్నాత్ తన 15 ఏళ్ల చెల్లి జోబియాను కత్తితో పొడిచి చంపింది.
చెల్లెలి ఖాతాకు ఫాలోవర్లు ఎక్కువగా ఉండటంతో అసూయ చెందిన అక్క, మంగళవారం రాత్రి గొడవపడి వంటగదిలోని కత్తితో సోదరి వీపుపై దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన జోబియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అధిక రక్తస్రావం కారణంగా మరణించగా, తండ్రి అబ్దుల్ షకూర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.