
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయించుకోగా, శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీలో తమకు తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వెల్లడించింది.