
బిహార్లోని లఖిసరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారని జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
ఆలయ క్యూ లైన్ సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోవడంతో అది విద్యుత్ వైర్ అని భక్తులు భ్రమపడి పరుగులు తీయడం వల్ల ఈ ప్రమాదం ఆగస్టు 17న చోటుచేసుకుంది.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన బిహార్ ప్రభుత్వం, గాయపడిన వారికి సదర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తోంది.