
స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఈ కేసులో వాదనల కోసం సీనియర్ న్యాయవాదులను నియమించాలని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.