
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
ఈ పర్యటనకు సిద్ధమవుతున్న భారత జట్టుకు బుమ్రా అందుబాటులో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
బుమ్రా గైర్హాజరీతో భారత బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.