నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఆగస్టు 11న జరిగిన ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించి, ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ. 1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, కత్తి, గ్లౌజులు, మాస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
హత్యకు వారం రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించారని, మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.