
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని 'ది దాలియాస్' ప్రాజెక్టులో 17,200 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను రూ.271 కోట్లకు ఇంపీరియల్ ఆటో గ్రూప్ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా కొనుగోలు చేశారు.
ఈ డీల్ ప్రకారం కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు రూ.2.6 లక్షల ధర పలికింది, ఇది భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
1969లో ప్రారంభమైన ఇంపీరియల్ ఆటో సంస్థ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉంటూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 23 ఉత్పాదన కేంద్రాలను కలిగి ఉంది.