
ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు అప్రమత్తంగా లేకపోతే భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు తప్పవని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు.
ఏఐని వాడుతూ మనుషులను తొలగించే సంస్థలపై ప్రత్యేక పన్ను విధించాలని, ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ ఒప్పందాలు ఉండాలని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు.
ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఆశ్చర్యపరిచాయని పేర్కొన్న గేట్స్, జీవ ఆయుధాల తయారీకి ఈ సాంకేతికత దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.