
సుప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు వైఎస్ కృష్ణేశ్వరరావు (71) గుంటూరులోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు.
ఆయన 1,500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా, 'చందమామ కథలు' చిత్రానికి నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం అందుకున్నారు.
శ్రీరాములయ్య, భద్రాచలం వంటి చిత్రాలకు కథ అందించిన ఆయన, విరూపాక్ష, నాంది వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.