
చైనాకు చెందిన సన్‌వోడా ఈవీబీ కొత్త 15సీ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీని ఆవిష్కరించింది.
ఈ కొత్త బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జింగ్‌ను, 9 నిమిషాల్లో 97 శాతం ఛార్జింగ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ పని చేసే ఈ బ్యాటరీలు 10 ఏళ్లు లేదా 3 లక్షల కిలోమీటర్ల వారంటీని ఇస్తాయని పేర్కొంది.