
ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో భారత మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించినట్లు టెక్ దిగ్గజం యాపిల్ వెల్లడించింది.
మ్యాక్ కంప్యూటర్ల విక్రయాలు, సర్వీసులు, ఐఫోన్ అప్‌గ్రేడ్‌లు ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది.
సరఫరాపరమైన ఆటంకాలు ఎదురైనా గ్లోబల్‌గా ఐఫోన్లపై ఆదాయం 17 శాతం ఎగిసి 57.6 బిలియన్ డాలర్లకు చేరిందని సీఈవో జాన్ టెర్నస్ తెలిపారు.