
రష్యాలోని డీజిల్ వనరులపై డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చిందని ట్రంప్ ఆదివారం వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ ఎగుమతి దారైన రష్యా ప్రస్తుతం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దేశంలో ఇంధన రేషనింగ్ను అమలు చేస్తోంది.