
జాతీయ భద్రత, చట్టాల ఉల్లంఘనల నేపథ్యంలో విదేశీయులకు జారీ చేసిన సుమారు 1,75,000కు పైగా వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సమీక్షలో భాగంగా డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ (DUI), దాడులు, చోరీలు, మాదకద్రవ్యాల విక్రయాల నేరస్థుల వీసాలను రద్దు చేశారు.
విదేశాంగ విధానాల దృష్ట్యా క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్ దేశాల వారి వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.