
జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా రంగంలో ఏఐ వినియోగం, దాని ప్రభావం గురించి వివరించారు.
పరిశోధన, అభివృద్ధి వంటి ప్రాథమిక పనులకు ఏఐ అద్భుతమైన సాధనమని, గతంలో వారాలు, నెలలు పట్టే పనులను ఇప్పుడు గంటల్లో, నిమిషాల్లో పూర్తి చేస్తోందని చెప్పారు.
ప్రస్తుతం తాము ప్రాథమిక సమాచారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాత్రమే ఏఐని సహాయక సాధనంగా ఉపయోగిస్తున్నామని, డిజిటల్ కంటెంట్ నిర్మాణంలో దానిపై ఆధారపడడం లేదని తెలిపారు.