
ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చల అనంతరం, పెండింగ్లో ఉన్న 5 డీఏలలో రెండింటిని అక్టోబర్ నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
జనవరి 1 నుంచి పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 10 శాతానికి పెంచుతామని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, హెల్త్ కార్డుల సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.