
తమిళనాడులో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి విజయ్ ఒకే మెట్రో రైలులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించారు.
రూ. 4,900 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2 మొదటి విడతను పూనమల్లి బైపాస్ నుంచి వడపలని వరకు ఇద్దరు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ. 13 వేల కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.