
ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాల్లో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది.
పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్, పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్స్, ఫోరెన్సిక్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోలీసు ఉద్యోగార్థులకు ఇది తీపికబురు అని పేర్కొంటూ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.