
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎల్ఐసీలో జోనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
శ్రీశాంత్ తండ్రి మృతి పట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు తమ ప్రగాష్ట సంతాపం, సానుభూతిని తెలియజేశారు.