
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫీచర్ల వల్ల యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ మెటాపై అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు దాఖలు చేసిన కేసు విచారణ ప్రారంభమైంది.
యువ వినియోగదారులను ఆకర్షించేందుకు ఇన్ఫినిట్ స్క్రోల్, ఆటోప్లే వంటి ఫీచర్లను మెటా రూపొందించిందని, 13 ఏళ్లలోపు పిల్లల డేటాను సేకరించి చట్టాలను ఉల్లంఘించిందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
ఈ కేసులో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొసేరీ సాక్ష్యం చెప్పనుండగా, విచారణ సుమారు ఆరు వారాల పాటు కొనసాగనుంది.