
భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం రేగింది.
గత ఆరు నెలలుగా లేఖలు వస్తున్నప్పటికీ, సోమవారం వచ్చిన రెండు లేఖల్లో దంపతులను హతమారుస్తామని హెచ్చరించడంతో గంగూలీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దక్షిణ కోల్కతాలోని ఠాకుర్పుకూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఉత్తర 24 పరగణాల జిల్లా బెల్ఘరియాకు చెందిన వ్యక్తిపై అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.