
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్ మండపాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ తెలిపారు.
జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9.55 గంటల వరకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.