
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యాల కోసం సాంకేతికతను జోడించి పారదర్శకమైన పాలనను అమలు చేస్తున్నామని అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ మరియు వ్యవస్థీకరణకు పెద్దపీట వేస్తూ తితిదే అనేక సంస్కరణలను చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తితిదే పనిచేస్తోందని వివరించారు.