
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైల్ నెం.25 : ఫౌజీ' ఒరిజినల్ గ్లింప్స్ విడుదలయింది.
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య సంభాషణలు మరియు భగవద్గీత ఆధారంగా సీక్రెట్ కోడ్ వంటి ఆసక్తికర అంశాలతో ఈ గ్లింప్స్ సాగింది.
పీరియాడిక్ వార్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.