
తెలంగాణలో 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంగళవారం జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్లాట్ బుక్ చేసుకున్న వారి భూములను రెండు రోజుల్లోనే పరిశీలించి, అవి ప్రైవేటు భూములని నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వం ఆస్తి హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని, ప్రజలు దళారులను ఆశ్రయించకుండా తప్పుల్లేని తుది జాబితా తయారీకి సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.