
రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అజేయంగా 18 బంతుల్లో 44 పరుగులు చేసి పురుషుల టీ20 క్రికెట్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.
భారత బ్యాటర్లలో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్న ఐదో బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచారు.
టీ20 క్రికెట్లో 40 కంటే ఎక్కువ సగటు, 140కి పైగా స్ట్రైక్-రేట్‌తో 5 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.