
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బాధిత ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
భారీ వర్షాలు మరియు వరదలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.