
తాము తీసిన 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు గిరీష్ ఏడీ 'ప్రేమలు 2' గురించి మాట్లాడారు.
ఈ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినప్పటికీ అనుకోకుండా ప్రాజెక్ట్ ఆగిపోయిందని, అది తమకు పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడం వల్ల తమ విలువైన ఏడాది సమయం వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.