
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి.
సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఇండోర్ వేదికగా నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
గత మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది.