
రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కట్టబెట్టే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
అమెరికా ప్రతినిధుల సభలో 262–159 ఓట్లతో, సెనేట్‌లో 86–11 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
అయితే ఇదే బిల్లులోని సెక్షన్ 114 ప్రకారం కొన్ని రకాల రష్యా యురేనియం దిగుమతులు, వైద్య ఐసోటోపులకు మినహాయింపునిచ్చారు.