
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, దళవాయి రమాదేవిలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఈ మేరకు అభ్యర్థుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ఆమోదం కోసం ఏపీ కేబినెట్ రాజ్ భవన్‌కు పంపింది.