
ఐరోపా దేశమైన అల్బేనియా రాజధాని టిరానాలో ప్రతిపక్షాలు, విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో మాస్కులు ధరించిన ఆందోళనకారులు పార్లమెంటు భవనంపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు.
గత వారం రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 130 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడగా, భద్రతను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్లు ప్రయోగించారు.
డిప్యూటీ పీఎం బెలిండా బల్లుకుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం కారణంగా ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి.