
పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారనే కారణంతో ఆరుగురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదివారం తెలిపారు.
నోటీసులు అందుకున్న వారిలో ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస్, సంజీవ రెడ్డి, గజ్వేల్ నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డి ఉన్నట్లు సమాచారం.
నోటీసులు అందుకున్న నేతలు వారం రోజుల్లోపు తమ వివరణను క్రమశిక్షణ కమిటీకి సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.