
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కింద వరంగల్ ఎన్ఐటీకి రూ.4 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది.
ఈ ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తారు.
2027 మార్చి నాటికి 1200 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.