
బ్రెజిల్ దేశాధ్యక్ష ఎన్నికల తొలి విడతలో ఏ అభ్యర్థికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్ 25న రన్ ఆఫ్ పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
లిబరల్ పార్టీ నాయకుడు ఫ్లావియో బొల్సొనారో 47.45 శాతం ఓట్లతో ముందంజలో నిలవగా, ప్రస్తుత అధ్యక్షుడు లులా డా సిల్వా 44.66 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
అక్టోబర్ 25న జరిగే రన్ ఆఫ్ పోలింగ్‌లో విజేతగా నిలిచే కొత్త అధ్యక్షుడు 2027 జనవరి 5న బాధ్యతలు స్వీకరిస్తారు.